మున్సిపల్ ఎన్నికలు ఇప్పట్లో లేనట్లేనా!
KMM: జిల్లాలోని మున్సిపాలిటీలకు ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశాలు లేదని ప్రభుత్వ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇప్పటికే మున్సిపల్ పాలకవర్గాల పదవీకాలం పూర్తైన విషయం తెలిసిందే. పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో ఆ మరుసటి రోజు నుంచి ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది. మరో 6 నెలలు లేదా ఏడాది పాటు ప్రత్యేక పాలన కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.