VIDEO: బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికి గరుడ వాహన సేవ
SRD: ఖేడ్ మండలం సంజీరావుపేటలోని శ్రీ లక్ష్మీ అనంతసేన స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు సోమవారం రాత్రి స్వామివారికి గరుడ వాహన సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకు ముందు శ్రీవారికి ప్రత్యేక అభిషేక పూజలు, సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన తదితర పూజలు నిర్వహించారు. గ్రామ పురవీధుల్లో శ్రీవారు గరుడ వాహనంపై ఊరేగారు.