అయోధ్య రామాలయాన్ని దర్శించుకున్న మోదీ

అయోధ్య రామాలయాన్ని దర్శించుకున్న మోదీ

అయోధ్య రామాలయాన్ని ప్రధాని మోదీ దర్శించుకున్నారు. అనంతరం శ్రీరామ్‌లల్లా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు మహర్షి వశిష్ఠ, మహర్షి విశ్వామిత్ర, మహర్షి అగస్త్య, మహర్షి వల్మీకి, దేవి అహల్య, నిషాదరాజ్ గుహ, మాతా శబరిలను దర్శించుకున్నారు. కాసేపట్లో శ్రీరామ్‌లల్లా ఆలయంలో ధ్వజారోహణాన్ని మోదీ ప్రారంభించనున్నారు.