బురదలో దిగబడిన ఆర్టీసీ బస్సు

WGL: నెక్కొండ బస్టాండ్ సమీపంలో గురువారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు బురదలో దిగబడింది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో రోడ్డు బురదమయంగా మారడంతో ఈ సమస్య తలెత్తింది. దీంతో ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్య పై సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేశారు.