జిల్లా ఎస్పీ దామోదర్ విజయనగరం జిల్లాకు బదిలీ

జిల్లా ఎస్పీ దామోదర్ విజయనగరం జిల్లాకు బదిలీ

ప్రకాశం: జిల్లా ఎస్పీగా ఇప్పటివరకు బాధ్యతలు నిర్వహిస్తున్న దామోదర్‌ను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులను జారీ చేసింది. దామోదర్‌ను విజయనగరం జిల్లాకు బదిలీ చేస్తూ ప్రకాశం జిల్లాకు ఎస్పీ హర్షవర్ధన్‌ను నియమించింది. అతి త్వరలో ఎస్పీ హర్షవర్ధన్ ప్రకాశం జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించనున్నారు.