'వరద బాధితులకు నేతాజీ మాజీ సైనికుల విరాళం'

'వరద బాధితులకు నేతాజీ మాజీ సైనికుల విరాళం'

VZM: విజయవాడ వరద బాధితులను ఆదుకొని తమ వంతు సహాయాన్ని అందించేందుకు మాజీ సైనికులు ముందుకు వచ్చారు. జిల్లాలోని నేతాజీ మాజీ సైనికుల సంఘం సభ్యులు వరద బాధితుల సహాయార్థం రూ.1,00,123 చెక్కును మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే అదితి, కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేతులమీద విరాళంగా అందజేశారు. ఇందులో అధ్యక్షుడు పి గుణాకర్, ఉపాధ్యక్షుడు ఎస్ శ్రీనివాస్ పాల్గొన్నారు.