ట్రెక్కింగ్‌కు వెళ్లి.. నాలుగు రోజులు అడవిలోనే!
కర్ణాటకలోని తడియండమోల్ బెట్ట అడవుల్లో తప్పిపోయిన కేరళ ట్రెక్కర్ శరణ్య (సాఫ్ట్‌వేర్ ఇంజనీర్) ఆచూకీ 4 రోజుల తర్వాత లభ్యమైంది. ఏప్రిల్ 2న ట్రెకింగ్‌కు వెళ్లి దారితప్పిన ఆమె కోసం కేరళ CM విజ్ఞప్తితో కర్ణాటక ప్రభుత్వం భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. డ్రోన్లు, జాగిలాలతో గాలించి ఆమెను గుర్తించారు. ప్రస్తుతం ఆమె క్షేమంగా ఉన్నారని కర్ణాటక మంత్రి ఈశ్వర ఖండ్రే ధృవీకరించారు.