32 టేకు దుంగలు సీజ్
NZB: సిరికొండ రేంజ్ పరిధిలోని న్యావనందిలో అనుమతి లేకుండా నిల్వ చేసిన 32 టేకు దుంగలను అటవీ అధికారులు స్వాధీనం చేసుకుని సిరికొండ అటవీ క్షేత్ర కార్యాలయానికి తరలించారు. సుమారు రూ.25,000 విలువైన ఈ దుంగలను ఎవరు నిల్వ చేశారన్న దానిపై విచారణ చేపడుతున్నట్లు రేంజ్ అధికారి నర్సింగరావు గురువారం తెలిపారు.