దీక్షకు మద్దతు తెలిపిన వైసీపీ జిల్లా అధ్యక్షులు

దీక్షకు మద్దతు తెలిపిన వైసీపీ జిల్లా అధ్యక్షులు

ATP: ఆర్డీటీ సంస్థను యధావిధిగా కొనసాగించాలని కోరుతూ అనంతపురం కలెక్టరేట్ ఎదుట ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో సోమవారం చేస్తున్న రిలే నిరాహార దీక్షకు మద్దతుగా వైసీపీ జిల్లా అధ్యక్షులు వెంకటరామిరెడ్డి మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఆర్డీటీ మన జిల్లాకి ఎన్నో సేవలు అందిస్తుందని అలాంటి ఆర్డీటీ సంస్థకు వచ్చే నిధులను ఆపడం అన్యాయం అన్నారు.