మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
గద్వాల జిల్లాలోని రాజోళి మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే విజయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి పంట నాణ్యతను పరిశీలించారు. దళారులను నమ్మి నష్టపోకూడదని, ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకే పంటను విక్రయించాలని సూచించారు. రైతుల ఆర్థికాభివృద్ధికి ఈ కేంద్రాలు దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.