శ్రీ ఈరన్నస్వామికి వెండి హారతి పలకలు విరాళం
KRNL: కౌతాళం మండలం ఉరుకుందలో వెలసిన శ్రీ నరసింహ ఈరన్నస్వామికి మంత్రాలయం వాస్తవ్యులైన యం. పన్నాగ వెంకటేష్, వారి కుటుంబ సభ్యులు 500 గ్రాముల వెండి హారతి పలకలు మంగళవారం విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమీషనర్, కార్యనిర్వహణాధికారి తరుపున సీనియర్ అసిస్టెంట్ జి. కిరణ్ కుమార్ అందుకొన్నారు. దాతలకు స్వామివారి దర్శనం గావించి ప్రసాదం అందజేశారు.