BRS పాత దుకాణం తెరిచింది: పాయల్ శంకర్
TG: పోరుబాట పేరుతో BRS పాత దుకాణం మళ్లీ తెరిచిందని MLA పాయల్ శంకర్ అన్నారు. 'రైతుల పేరుతో పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. జోగురామన్న అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. BJPపై బురదజల్లే రాజకీయం చేస్తే సహించం. పదేళ్లలో ఫసల్ బీమా పథకం ఎందుకు అమలు చేయలేదు. ప్రైవేట్ వ్యాపారులతో కుమ్మక్కై.. పత్తి రైతుల పొట్టకొట్టిన చరిత్ర BRSది' అంటూ మండిపడ్డారు.