సింహాద్రిపురంలో పట్టపగలే చైన్ స్నాచింగ్

సింహాద్రిపురంలో పట్టపగలే చైన్ స్నాచింగ్

KDP: సింహాద్రిపురం గ్రామంలో పట్టపగలే ఓ మహిళ మెడలోని బంగారు చైను దొంగలు లాక్కెళ్లారు. శనివారం సింహాద్రిపురంలో బంగారు, వెండి ఆభరణాలకు పాలిష్ పెడతామని పౌడర్ చూపించి బంగారు చైన్ లాక్కొని వెళ్లిన ఘటన చోటు చేసుకుంది. వెంటనే బాధితులు పోలీసులకు సమాచారమందించారు. డీఎస్పీ మురళి నాయక్, సీఐ హాజీవలి, ఎస్సై అనిల్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.