సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎమ్మెల్యే శిరీష

SKLM: సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. పలాసలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ఇటీవల కాలంలో వికలాంగుల పెన్షన్లు తీసివేశారని తమకు అర్హత ఉన్న ఈ పరిస్థితి వచ్చిందని ఎమ్మెల్యేకు తెలియజేశారు. దీనిపై ఆమె స్పందిస్తూ నిన్ననే దీనిపై ముఖ్యమంత్రి స్పందించారన్నారు.