VIDEO: శ్రీకాకుళంలో రామ మందిరాలకు శ్రీరామనవమి శోభ
శ్రీకాకుళం నగరంలో శ్రీరామ మందిరాలకు భక్తులు పోటెత్తడంతో కల్యాణ శోభను సంతరించుకున్నాయి. శ్రీరామనవమి సందర్భంగా సీతారామ కళ్యాణానికి రామ మందిరాలను ముస్తాబు చేశారు. పలు చోట్ల చలువ పందిళ్ళు ఏర్పాటు చేశారు. రామాలయాలకు వచ్చే భక్తులకు పానకం ప్రసాద వితరణ చేస్తున్నారు. అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు నిర్వహించారు.