పాఠశాలలో రాష్ట్రీయ బాల్ స్వాస్థ కార్యక్రమం
GDWL: గట్టు మండలం ఆరగిద్ద మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఇవాళ రాష్ట్రీయ బాల్ స్వాస్థ కార్యక్రమం (RBSK) నిర్వహించారు. పుట్టుక నుంచి 18 సంవత్సరాల వయసు గల పిల్లలకు సమగ్ర ఆరోగ్య సంరక్షణపై RBSK ఆధ్వర్యంలో ఉచితంగా చికిత్స అందిస్తారు. పుట్టుకతో వచ్చే లోపాలు, వ్యాధులు, అభివృద్ధి ఆలస్యం వంటి సమస్యలను పిల్లల్లో ముందుగా గుర్తించి చికిత్స తీసుకోవాలని RBSK నోడల్ అధికారి జయరాజు తెలిపారు.