వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా వీరబాబు
కోనసీమ: వైసీపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా మండపేట మండలం పాలతోడుకు గ్రామానికి చెందిన పిల్ల వీరబాబు నియమితులయ్యారు. పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తాడేపల్లి కేంద్ర కార్యాలయం నుంచి శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ఆయన వైసీపీ పార్టీ స్థాపించిన దగ్గరనుంచి పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.