పరీక్షల నిర్వహణను పరిశీలించిన జాయింట్ కలెక్టర్

పరీక్షల నిర్వహణను పరిశీలించిన జాయింట్ కలెక్టర్

కోనసీమ: అమలాపురం మండలంలోని కామనగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద పదవ తరగతి పరీక్షల నిర్వహణను సోమవారం జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి పరిశీలించారు. విద్యార్థులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని అధికారులకు సూచించారు.