మహిళల్లో నూతనోత్సాహాన్ని తెచ్చిన స్త్రీ శక్తి పథకం

GNTR: రాష్ట్ర కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం మహిళల్లో నూతనోత్సాహం, ఆహ్లాదాన్ని తీసుకొచ్చిందని మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం రోజుకు 25 లక్షల మంది మహిళలు పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారని వివరించారు.