చెరువులో పడి వ్యక్తి మృతి

చెరువులో పడి వ్యక్తి మృతి

CTR: పూతలపట్టు మండలం ఎగువ పాలకురు గ్రామానికి చెందిన రామకృష్ణయ్య చెరువులో పడి మృతి చెందాడు. స్థానికుల ప్రకారం.. దిగువ పాలకురు చెరువులో ఆవులు మేపడానికి వెళ్లి ఆవుల్ని అదుపు చేసే క్రమంలో చెరువులో దిగి ఈత రాకపోవడంతో ఊపిరాడక మృతి చెందాడు. ఇంటికి పెద్ద దిక్కుగా ఆవులు మేపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న వ్యక్తి మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.