మస్కట్‌లో చిక్కుకున్న కార్మికులకు కేంద్ర మంత్రి భరోసా

SKLM: జిల్లా నుంచి ఉపాధి కోసం మస్కట్ వెళ్లిన కార్మికుల సమస్యపై కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు స్పందించారు. జీతభత్యాలు లేకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్న 9 మంది తెలుగు కార్మికులతో కేంద్ర మంత్రి శ్రీకాకుళం కార్యాలయం నుంచి వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. పరిస్థితులను గురించి అడిగి తెలుసుకొని వారికి ధైర్యం చెప్పారు.