రాష్ట్రస్థాయి పోటీల్లో ఆదిలాబాద్ వాసి సత్తా

రాష్ట్రస్థాయి పోటీల్లో ఆదిలాబాద్ వాసి సత్తా

ADB: రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీల్లో ఆదిలాబాద్‌కు చెందిన కొమ్ము కృష్ణ సత్తా చాటాడు. హైదరాబాద్‌లోని అంబర్పేట్‌లో జరిగిన 10వ తెలంగాణ మాస్టర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్‌లో ఆయన 100 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్ ఈవెంట్‌లో స్వర్ణ పతకం సాధించాడు. విజేత కృష్ణను డీవైఎస్‌వో జక్కుల శ్రీనివాస్, ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి అభినందించారు.