మరో సంస్థపై ట్రంప్ సర్కార్ ఉగ్రముద్ర

మరో సంస్థపై ట్రంప్ సర్కార్ ఉగ్రముద్ర

ముస్లిం బ్రదర్‌హుడ్ సంస్థలపై ఉగ్రముద్ర వేసేందుకు ట్రంప్ సర్కారు చర్యలు చేపట్టింది. ఈ చర్యతో అరబ్‌ ప్రపంచంలోని ఓ పురాతన ఉద్యమం ఆంక్షల పరిధిలోకి వెళ్లనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఆదేశాలపై అధ్యక్షుడు ట్రంప్‌ సంతకం చేశారు. ఈ మేరకు అమెరికా విదేశాంగ మంత్రి, ఆర్థిక మంత్రికి ఆదేశాలు జారీ చేయగా.. రివ్యూ ప్రక్రియను ప్రారంభించారు.