బావిలో ఈతకు వెళ్లి విద్యార్థి గల్లంతు

బావిలో ఈతకు వెళ్లి విద్యార్థి గల్లంతు

SDPT: మద్దూరు మండలం సలాకుపూర్ గ్రామంలో విషాదం నెలకొంది. శనివారం బావిలో ఈతకు దిగి అఖిల్ అనే యువకుడు గల్లంతయ్యాడు. అయితే, అఖిల్ వేసవి సెలవులకు బంధువుల ఇంటికి వచ్చినట్లు తెలుస్తోంది. అఖిల్ స్వగ్రామం చేర్యాల మండలం పెద్దమ్మగడ్డ కాలనీగా సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.