VIDEO: నిరుపయోగంగా బోటింగ్
SRD: పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు మూడేళ్ల క్రితం సంగారెడ్డిలోని మహబూబ్ సాగర్ చెరువు కట్టపై ప్రారంభించిన బోటింగ్ సదుపాయం నిరుపయోగంగా మారింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా బోట్లు నీటిలో కాకుండా ఒడ్డునే ఉండి పాడవుతున్నాయి. పర్యాటకులు ఎంతో ఆశగా వస్తున్నా, బోటింగ్ అందుబాటులో లేకపోవడంతో నిరాశతో వెనుతిరుగుతున్నారు.