ఫేస్ యాప్ వల్ల ఉపాధి హామీ కార్మికులకు ఇబ్బందులు

ఫేస్ యాప్ వల్ల ఉపాధి హామీ కార్మికులకు ఇబ్బందులు

NDL: బనగానపల్లె మీరాపురం పంచాయతీలో ఉపాధి హామీ కార్మికులు ఫేస్ యాప్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇవాళ CPI మండల కార్యదర్శి శివయ్య తెలిపారు. నెట్‌వర్క్ సమస్యల కారణంగా హాజరు నమోదు ఆలస్యం అవుతూ గంట సమయం వృథా అవుతోందని కార్మికులు తెలిపారు. పాత విధానాన్ని కొనసాగించాలని, సకాలంలో వేతనాలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.