సిద్దవటంలో సీఎం జన్మదిన వేడుకలు

సిద్దవటంలో సీఎం జన్మదిన వేడుకలు

KDP: టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు ఆదివారం సిద్దవటం మండలంలోని శ్రీ పరమాత్మ తపోవన వృద్ధాశ్రమంలో టీడీపీ క్లస్టర్ ఇంచార్జ్ శనివారపు మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం వృద్ధులకు బిస్కెట్లు, బ్రెడ్లు పంచిపెట్టారు.