దీక్షా దివాస్‌కు తరలి రావాలి: మాజీ MLA
హన్మకొండ: జిల్లాలోని కాళోజీ జంక్షన్ వద్ద ఈ రోజు ఉదయం 10 గంటలకు దీక్షా దివాస్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు. నియోజకవర్గంలోని ఉద్యమకారులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. 2009, నవంబర్ 29న KCR చేసిన ఆమరణ దీక్షతోనే తెలంగాణ ఉద్యమం పతాక స్థాయికి చేరిందని పేర్కొన్నారు.