ఆర్య వైశ్యులందరికీ శుభాకాంక్షలు: చంద్రబాబు

AP: వాసవీ కన్యాకాపరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా ఆర్య వైశ్యులందరికీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. 'శ్రీ పార్వతీ దేవి అవతారంగా భావించే అమ్మవారు మనందరికి పరమ పూజ్యురాలు. పరమ శివుడికే జీవితాన్ని అంకితం చేసిన అమ్మవారు ఆనాటి దుష్టపాలకుడి దుర్నీతికి ఆత్మత్యాగం చేసిన పవిత్రురాలు. అలాంటి ఆ అమ్మవారి జయంతి మనకు ఎంతో పవిత్రమైనది' అంటూ ఎక్స్‌లో పోస్టు పెట్టారు.