అత్తిలిలో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ

W.G: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అత్తిలిలో హర్‌ఘర్ తిరంగా ర్యాలీ బుధవారం ఘనంగా నిర్వహించారు. అత్తిలి బస్టాండ్ నుంచి సంతమార్కెట్ సెంటర్ వరకు దేశభక్తి గీతాలు పాడుతూ జాతీయ జెండాలు పట్టుకుని వందేమాతరం, భారత్ మాతాజీకు జై అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జ్ ఎంపీడీవో ఎం.శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ సుంకర నాగేశ్వరరావు పాల్గొన్నారు.