16 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న రంభ
అందాల నటి రంభ మళ్లీ వెండితెరపై మెరవనుంది. ఎనిమిది భాషల్లో వందకు పైగా చిత్రాల్లో నటించిన ఆమె, 2010లో వివాహం తర్వాత సినిమాలకు దూరమైంది. దాదాపు 16ఏళ్ల తర్వాత ఇప్పుడు రీఎంట్రీకి సిద్ధమైంది. ఇందుకోసం బరువు తగ్గి సరికొత్త గ్లామర్‌తో కనిపిస్తుంది. ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో ఒక్కో క్రేజీ ప్రాజెక్టును దక్కించుకున్న రంభ, త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది.