'ద హండ్రెడ్ లీగ్'లో కోచ్‌గా డీకే
దినేష్ కార్తీక్ బ్యాటింగ్ కోచ్, మెంటర్‌గా RCB తన తొలి IPL టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇంగ్లండ్ 'ద హండ్రెడ్ లీగ్'లో 'లండన్ స్పిరిట్' ఫ్రాంచైజీ తరఫున కూడా DK అదే పాత్ర పోషించబోతున్నాడు. టీ20 ఫార్మాట్లో అతడి అనుభవం తమ జట్టుకు చాలా ఉపయోగపడుతోందని లండన్ స్పిరిట్ పేర్కొంది. కాగా, DK ఐపీఎల్‌లో మొత్తం 257 మ్యాచ్‌లు ఆడాడు.