'తలసేమియా వ్యాధిగ్రస్తుల ఆరోగ్య సమస్యలు పరిష్కరించాలి'

'తలసేమియా వ్యాధిగ్రస్తుల ఆరోగ్య సమస్యలు పరిష్కరించాలి'

మంచిర్యాల జిల్లాలోని తలసేమియా, సికిల్ సెల్ వ్యాధిగ్రస్తుల ఆరోగ్య సమస్యలను పరిష్కరించాలని తలసేమియా వెల్ఫేర్ సొసైటీ సభ్యులు కోరారు. ఈ మేరకు సోమవారం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెండెంట్‌కు వినతిపత్రం అందజేశారు. 300 మంది వ్యాధిగ్రస్తులకు నెలకు సుమారుగా రూ. 9వేల మందులు అందజేయాలన్నారు. ఆరోగ్యశ్రీ జీఓ ప్రకారం అన్ని మందులు ఇవ్వాలన్నారు.