'మొబైల్ ఆధార్ క్యాంపులు నిర్వహించాలి'

PPM: సీతంపేట ఐటీడీఏ పరిధిలోని అన్ని గిరిజన గ్రామాలలో మొబైల్ ఆధార్ క్యాంపులు నిర్వహించాలని ఐటీడీఏ పీవో పవర్ స్వప్నిల్ ఆదేశించారు. శుక్రవారం సీతంపేటలో మొబైల్ ఆధార్ క్యాంపు శిక్షణ కార్యక్రమంలో పీవో పాల్గొన్నారు. ఆధార్ కార్డు సవరణకి గిరిజనులు తీవ్ర ఇబ్బందులు గురి అవుతున్నారన్నారు. ఆ సమస్య లేకుండా ఉండేందుకు ఈ మొబైల్ ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నామన్నారు.