'కోహిర్ ఎస్సైపై చర్యల తీసుకోవాలి'

SRD: కోహిర్ పోలీస్ స్టేషన్ ఎస్సై నరేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఖేడ్ MRPS నాయకులు, న్యాయవాది అలిగే జీవన్ ఆరోపించారు. ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సంగారెడ్డి పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్పీ పారితోష్ పంకజ్‌కి ఫిర్యాదు అందజేశారు. బాధితుడు మోహన్ తరఫున పోలీస్ స్టేషన్‌కి వెళ్లినప్పుడు ఎస్సై దుర్భాషలాడారని జీవన్ ఆరోపించారు.