'రైతు తీవ్రంగా నష్టపోతున్నారు'
NLG: రైతులు పండించిన వరి పంట కొనుగోలులో మిల్లర్లు రోజుకో విధానం పాటించడం వల్ల రైతు తీవ్రంగా నష్టపోతున్నారని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వీరేపల్లి వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ రైతు సంఘం నాయకులు పట్టణంలోని అనేక రైస్ మిల్లు కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. రైతులకు కనీసం మద్దతు ధర నిర్ణయించాలని కోరారు.