VIDEO: పంట పొలాల్లోకి దూసుకెళ్లిన కారు

VIDEO: పంట పొలాల్లోకి దూసుకెళ్లిన కారు

కృష్ణా: పెనమలూరు మండలం పెదపులిపాక కరకట్టపై ఆదివారం పెనుప్రమాదం తప్పింది. స్థానికుల వివరాల ప్రకారం.. కరకట్టపై ప్రయాణిస్తున్న కారు టైర్ పంక్చర్ కావడంతో అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. అయితే కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు సురక్షితంగా బయటపడ్డారు. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన గ్రామంలో ఒకింత కలకలం రేపింది.