ప్రజా పోరాటాలకు స్ఫూర్తి.. దొడ్డి కొమురయ్య: KCR
TG: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా ఆయనకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఘన నివాళి ఆర్పించారు. ప్రజా వ్యతిరేక పాలన మీద రాష్ట్ర ప్రజల తిరుగుబాటుకు సంకేతంగా నిలిచిన కొమరయ్య అమరత్వం, నాటి రాచరిక పాలకుల నుంచి నేటి ప్రజా వ్యతిరేక పాలకుల మీద సాగుతున్న ప్రజా పోరాటాలకు స్పూర్తిగా నిలిచిందని కేసీఆర్ తెలిపారు.