నేడు రాష్ట్ర బడ్జెట్‌పై సన్నాహక సమావేశాలు
TG: రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్‌పై ఇవాళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సన్నాహక సమావేశాలను నిర్వహించనున్నారు. శాఖల వారీగా డిప్యూటీ సీఎం సమీక్షలు చేపట్టనున్నారు. 2026-27 బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్షించనున్నారు. ఈ మేరకు ఆయా శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.