సైబర్ నేరగాళ్ల వలలో పడి.. లక్ష డెబిట్

సైబర్ నేరగాళ్ల వలలో పడి.. లక్ష డెబిట్

MDK: తూప్రాన్‌కు చెందిన కొక్కొండ శ్రీధర్ రెడ్డి ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు రూ. లక్ష డెబిట్ చేసినట్లు ఎస్సై శివానందం తెలిపారు. ఫోన్‌లోకి ఆటోమేటిక్‌గా ఏపీకే ఫైల్ డౌన్‌లోడ్ జరిగి తెలంగాణ గ్రామీణ బ్యాంకు నుంచి 19న లక్ష డెబిట్ జరిగింది. బ్యాంకు అధికారులను సంప్రదించగా సైబర్ నేరగాళ్లు బదిలీ చేసినట్లు గుర్తించి బాధితుడు శుక్రవారం ఫిర్యాదు చేసినట్లు వివరించారు.