మేడారం అడవుల వైపుకు పులి పయనం

MLG: రెండురోజుల క్రితం ములుగు జిల్లా పత్తిపల్లి అడవుల్లోకి వచ్చిన పెద్దపులి వెంకటాపూర్ మండలం నర్సాపూర్ మీదుగా సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు గుర్తించారు. పులి కదలికలను బట్టి గుర్రంపేట, మల్లయ్యపల్లి నుంచి మేడారం అడవుల వైపుకు వెళ్తున్నట్లు భావిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. పొలాలకు వెళ్ళవద్దని సూచించారు.