VIDEO: గుండెపోటుతో వ్యక్తి మృతి

VIDEO: గుండెపోటుతో వ్యక్తి మృతి

KMM: ఉపాధి హామీ పనులకు వెళ్ళి కూలీ మృతి చెందిన ఘటన బుధవారం కూసుమంచి మండలంలో చోటుచేసుకుంది. రహదారి పక్కన మొక్కలు నాటుతుండగా గ్రామానికి చెందిన కొంగర పుల్లయ్య స్పృహ తప్పి కింద పడిపోయారు. తోటి కూలీలు వెంటనే సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. ఆయన అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. మృతికి ప్రధాన కారణం గుండెపోటు అని ప్రాథమికంగా నిర్థారించారు