'యుద్దోన్మాదంపై ప్రధాని నరేంద్రమోడీ మౌనం వీడాలి'
హన్మకొండ జిల్లా బాలసముద్రంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ కే. నారాయణ మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. భారత దేశానికి నష్టం కలిగిస్తున్న అమెరికా యుద్దోన్మాదంపై ప్రధాని నరేంద్రమోడీ మౌనం వీడాలని, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యుద్ద కాంక్షతో అనేక దేశాలు ప్రభావితం అవుతున్నాయన్నారు.