ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆత్మీయ వీడ్కోలు
SDPT: హుస్నాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తృతీయ సంవత్సరం విద్యార్థులకు ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ విజయగిరి బిక్షపతి మాట్లాడుతూ.. డిగ్రీ చదువుతున్న కాలంలో ఏర్పడిన అనుబంధాలు, మధుర జ్ఞాపకాలను జీవితాంతం గుర్తుంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. భవిష్యత్తులో మంచి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.