స్వల్పంగా పెరిగిన పత్తి ధర

స్వల్పంగా పెరిగిన పత్తి ధర

WGL: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధరలు అన్నదాతలను అయోమయానికి గురి చేస్తున్నాయి. సోమవారం క్వింటా పత్తి ధర రూ.6,950 పలకగా.. మంగళవారం రూ.6900కి పడిపోయింది. ఈ రోజు మళ్లీ స్వల్పంగా పెరిగి క్వింటా పత్తి ధర రూ.6, 935కి చేరింది. గతవారం రూ.7,000 పలికిన పత్తి ధర మళ్లీ తగ్గడంతో రైతన్నలు నిరాశ చెందుతున్నారు.