'అంబేద్కర్ విగ్రహానికి స్థలం కేటాయించాలి'

'అంబేద్కర్ విగ్రహానికి స్థలం కేటాయించాలి'

ASR: డుంబ్రిగూడ మండల కేంద్రంలో డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు స్థలం కేటాయించాలని కోరుతూ స్థానిక అంబేద్కర్ సంఘం నాయకులు, గ్రామస్తులు సోమవారం తహసీల్దార్‌ త్రివేణికి వినతిపత్రం సమర్పించారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు ఆయన ఆశయాలు మరింతగా చేరువ అవుతాయని పేర్కొన్నారు.