వాంకిడిలో అదుపుతప్పి బొగ్గు లారీ బోల్తా

ASF: వాంకిడి పోలీస్ స్టేషన్ సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆసిఫాబాద్ నుంచి మహారాష్ట్రకు బొగ్గు లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి జాతీయ రహదారిపై బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్ చిన్నపాటి గాయాలతో బయటపడ్డాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని గాయపడిన వ్యక్తికి ప్రథమ చికిత్స అందించారు.