జిల్లా బీజే‌పీ ఇంఛార్జిగా బండ కార్తీకరెడ్డి

జిల్లా బీజే‌పీ ఇంఛార్జిగా బండ కార్తీకరెడ్డి

నారాయణపేట జిల్లా భారతీయ జనతా పార్టీ ఇంఛార్జిగా హైదరాబాద్ మాజీ మేయర్ భాజపా సీనియర్ నాయకురాలు బండ కార్తీక రెడ్డి నియమితులయ్యారు. శనివారం బీజేపీ రాష్ట్ర సెక్రటరీ గౌతమ్ రావు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని పార్టీ పటిష్టత కోసం శాయశక్తులా కృషి చేస్తానని వెల్లడించారు.