గిరిజన బాలుర హాస్టల్‌లో తనిఖీలు
WGL: నర్సంపేటలోని గిరిజిన సంక్షేమ శాఖ బాలుర హాస్టల్‌ను సోమవారం జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ ఆకస్మీక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారిణి సౌజన్య, అధికారులు పాల్గొన్నారు.