సైనిక్ పూరిలో ATM వద్ద భద్రత కరువు..!
HYD: సైనిక్ పూరి ప్రధాన రహదారిలో యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం భద్రత అంతగా లేదని అక్కడికి వెళ్లిన ప్రజలు తెలిపారు. విత్ డ్రా చేసేటప్పుడు అన్ని వివరాలు బయటకు కనిపిస్తున్నాయని, దీని ద్వారా సమాచారం లీక్ జరిగే అవకాశం ఉన్నట్లుగా పేర్కొన్నారు. దీనిపై అధికారిక బ్యాంకింగ్ యంత్రాంగం స్పందించాలని కోరుతున్నారు. ఈ మేరకు ఫిర్యాదులు చేశారు.